Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి రఘుమారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. డిస్కాం పరిధిలో సంభవించిన బ్రేక్డౌన్ల మీద ఇంజినీర్లతో చర్చించారు. వీలైనంత తొందరగా బ్రేక్డౌన్కు సంబంధించిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1,448 కోట్ల నెలవారీ డిమాండ్కుగాను 99 శాతం వసూళ్లు అయ్యాయని వివరించారు. అందులోనూ సౌత్ సర్కిల్లో రూ.119 కోట్ల రెవెన్యూ డిమాండ్కుగాను రూ.118 కోట్లు వసూళ్లయ్యాయని పేర్కొన్నారు. డిస్కాం సాంకేతిక, వ్యాపార నష్టాలను మరింతగా తగ్గించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఉగాది, రంజాన్ ఉపవాసాల సమయంలో సిబ్బంది అప్రమత్తగా ఉండాలనీ, అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అయ్యేటట్టు చూడాలని కోరారు.