Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సుల్తానియా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధి హామీ చట్టంలో భాగంగా మెటీరి యల్ కాంపొనెంట్ కింద చేపట్టిన పనులకు సంబంధించి ఈనెల 25లోగా ఫండ్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో) జనరేషన్‌ను విధిగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అదనపు కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల అదనపు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీఆర్డీవోలు, అదనపు డీఆర్డీవోలు, పంచాయతీరాజ్ ఈఈలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ మెటీరియల్ కాంపొనెంట్‌లో అనుసంధానమై ఉన్న సీసీ రోడ్లతోపాటు మన ఊరు-మనబడి, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్ తదితర పనులకు సంబంధించి ఎఫ్‌టీవో జనరేషన్ ఈనెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిజామాబాద్, నిర్మల్, మహబూబాబాద్, మెదక్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలు ఎఫ్‌టీవో జనరేషన్లో వెనుకబడి ఉన్నాయని చెప్పారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లను కోరారు. ఎఫ్‌టీవో జనరేషన్ విషయంలో రూ.కోటి మిగిలి ఉండొద్దని సూచించారు. ఆలస్యం చేస్తే ఆయా జిల్లాలు నష్టపోయే అవకాశముందని అన్నారు. నల్లగొండ, మేడ్చల్, జనగామ జిల్లాలు ఎఫ్‌టీవో జనరేషన్ సకాలంలో చేపట్టడం పట్ల ఆయన అభినందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈనెల 25లోగా పూర్తికావాలనీ, జాప్యం చేస్తే చివరి క్షణంలో సర్వర్లపై ఒత్తిడి పెరిగి పని కష్ట సాధ్యమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.