Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈడీకి దొరకకుండా తాను ఫోన్లను ధ్వంసం చేశానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు మంగళవారం ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు ఆమె లేఖ రాశారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నట్టు తెలిపారు. ఒక మహిళ ఫోన్ స్వాధీనం చేసుకోవడం గోప్యతకు భంగం కలి గించడం కాదా ? అంటూ ప్రశ్నించారు. 'దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ఫోన్లను ధ్వంసం చేశానని పేర్కొంది, నన్ను కనీసం అడగ కుండానే ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ?. నన్ను తొలి సారిగా ప్రస్తుత మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గతేడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానంటూ ఈడీ ఆరోపించడం అంటే దురు ద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. దాంతో పాటు ఈ విష యంపై లీకులు ఇవ్వడం వల్ల నన్ను రాజకీయ ప్రత్యర్థులు ప్రజల్లో నిందిస్తు న్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువు ను, మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించేందుకు ప్రయత్నించారు.