Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నాలకు టీయుఎంహెచ్‌ఇయూ మద్దతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ-కుబేర్‌లో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలనే డిమాండ్‌పై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఈ నెల 24న నిర్వహించ తలపెట్టిన ధర్నాలకు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) సంపూర్ణ మద్ధతు తెలిపింది. ఈ మేరకు మంగళవారం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు,కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పీఆర్సీ ఏరియర్స్ బిల్లులు, ప్రావిడెంట్ ఫండ్లోన్లు, సరెండర్ లీవులు, ఫిక్స్డ్ టూర్ అలవెన్సులు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఈ కుబేర్‌లో నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. దీంతో వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులన్నింటిని చెల్లించాలని యాదానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.