Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి), సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ స్టడీస్ (పీజీడీఎం), కేంద్రం పిన్నాకిల్ 23 సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 24,25 తేదీల్లో బంజారాహిల్స్‌లోని కాలేజ్ పార్క్ క్యాంపస్‌లో ఇంటర్ - కాలేజ్ మేనేజ్మెంట్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నాయి. మరుపురాని అనుభూతిని అందించే ఈ ఉత్తేజకరమైన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరా యి. డిగ్రీ, పీజీ విద్యార్థులు బుధవారంలోగా పిన్నాకిల్23 కోసం పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆస్కి, పీజీడీఎం వెబ్సైట్ https: //ascipgdm.inను సందర్శించాలని కోరింది. మరిన్ని వివరాల కోసం 8341288816, 8885398849, 9032705403 నెంబర్లను సంప్రదిం చాలని సూచించింది. రెండురోజులపాటు నిర్వహించే ఈ ఫెస్ట్‌లో ఉప సంఘ టనలు, పోటీలు, వినోద కార్యక్రమాలుంటాయని తెలిపింది. డీజే బృందంతో సాంస్కృతిక కార్యక్రమం ఉంటుందని వివరించింది. అద్భుతమైన బహుమ తులు, కూపన్లు, సర్టిఫికెట్లు గెలుచుకునే అవకాశముందని పేర్కొంది. బెస్ట్ మేనేజర్ ప్రైజ్, ట్రోఫీ, ఆకర్షణీయమైన నగదు బహుమతిని పొందొచ్చని సూ చించింది. ఇండియా విజన్-2047 పేరుతో సెమినార్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. భారతదేశం స్వాతంత్య్రం పొంది వందేండ్లకు చేరుకుంటున్న సందర్భంగా యువత ఆశలు, ఆకాంక్షలను చర్చిస్తున్నట్టు వివరించింది.