Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరువర్గాల ఆందోళన
- ఒక జేఏసీ నిరుద్యోగ మార్చ్,..
- మరో జేఏసీ నిరసన దీక్ష .. విద్యార్థి నాయకుల అరెస్ట్
- కిరోసిన్ పోసుకున్న ఇద్దరు విద్యార్థులు.. అడ్డుకున్న పోలీసులు
- రేవంత్‌రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వీ నాయకుల నిరసన
నవతెలంగాణ-ఓయూ
పేపర్ లీకేజీకి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి జేఏసీ నిరుద్యోగ మార్చ్‌కు పిలుపు ఇవ్వగా, మరొక జేఏసీ నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. దాంతో శుక్రవారం ఓయూలో ఆర్ట్స్ కళాశాల వద్ద రోజంతా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే దీక్షకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆహ్వానించడంతో బీఆర్ఎస్వీ విద్యార్థులు రేవంత్ రాకను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో విద్యార్థుల నిరసనలు, అరెస్టులతో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం అట్టుడికింది.
తెల్లవారుజాము నుంచే అరెస్టులు
పేపర్ లీకేజీ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పలు విద్యార్థి నిరుద్యోగ సంఘాలు శుక్రవారం నిరుద్యోగ మార్చ్, దీక్ష, ధర్నాలకు పిలుపునివ్వడంతో తెల్లవారుజామున నుంచే హాస్టళ్లలో ఉన్న పలువురు విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. అయితే కొందరు విద్యార్థి నాయకులు ఆర్ట్స్ కళాశాల నుంచి గన్ పార్క్ వరకు మార్చ్ చేయడానికి సిద్ధం కాగా వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భ ంగా నాయకులు మాట్లాడుతూ. పేపర్ల లీకేజీకి కార కులైన చైర్మెన్, సభ్యులను వెంటనే తొలగించాలన్నా రు. లీకేజీ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటించాలన్నారు.
ఓయూ ఐక్య విద్యార్ది సంఘాల అధ్వర్యంలో దీక్ష...అరెస్టు
ఇదిలా ఉండగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల అధ్వర్యంలో విద్యార్థి నాయకులు ఆర్ట్స్ కళాశాల ఎదుట దీక్షకు దిగడంతో వెంటనే వారిని పోలీసులు అడ్డుకొని ఓయూ పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. లీకేజీపై సీబిఐతో సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి యత్నించిన బీఆర్ఎస్వీ నాయకులు..
మరోవైపు రేవంత్‌రెడ్డి ఓయూకు వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్వీ సంఘం నాయకులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి వారు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ మాట్లా డుతూ రేవంత్‌రెడ్డి విద్యార్థులతో రాజకీయాలు చేస్తూ చిచ్చు పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నిం చారు.
పెట్రోల్ పోసుకున్న ఇద్దరు.. అడ్డుకున్న పోలీసులు
పేపర్ లీకేజీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓయూ విద్యార్థి నాయకులు నగేష్, శ్రీకాంత్‌లు పెట్రోల్ పోసుకోగా మరో ఇద్దరు కూడా అందుకు యత్నించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరీక్ష పేపర్లు లీక్ అవుతుంటే తాము ఇంత కష్టపడి ఏం లాభమని అవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. బోర్డును ప్రక్షాళన చేసి మళ్లీ నోటిఫికేషన్ వేయాలని, నష్ట పోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూ ఎన్సీసీ గెేట్ వద్ద కూడా ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూ, నల్లకుంట, అంబర్పేట్, లాలాగూడా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్ కూడా ఉన్నారు. ఓయూలో ఆందోళన నేపథ్యంలో ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్, ఓయూ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్‌లు యూనివర్సిటీలోనే ఉన్నారు. వీరితోపాటు ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 15 మంది ఎస్ఐలు, నలుగురు ఏఆర్ ప్లెటున్స్తో బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఓయూ దీక్షకు వెళ్లకుండా రేవంత్ హౌస్ అరెస్టు
- పలువురు నేతలు గృహ నిర్బంధంలోనే...
- పలువురు నేతలు గృహ నిర్బంధంలోనే...
ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన మహా దీక్షకు హాజరయ్యేందుకు ప్రయత్నించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారులన్నీ మూసివేశారు. దీక్షకు అనుమతి లేదంటూ రేవంత్‌ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నాయకులు, కార్యకర్తలను రేవంత్ ఇంటి వైపు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసి విలేకర్లతో రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌కు దమ్ముంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 'మీరు సచ్ఛీలురైతే, స్కాంలో మీ పాత్ర లేకపోతే నా సవాల్‌ను స్వీకరించాలి' అని ట్వీట్ చేశారు. పార్టీ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి, చామలకిరణ్రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, సునీతారావు, ఓయూ నేతలు తదితరులు గృహ నిర్బంధంలో ఉన్నారు.