Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటి వరకు స్వాధీనపర్చుకున్న
ఆస్తులు విలువ రూ. 400 కోట్ల పైనే..!
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
అధిక మొత్తంలో వడ్డీలు చెల్లిస్తానంటూ వేల కోట్ల రూపాయల మేరకు డిపాజిటర్ల నెత్తిన కుచ్చుటోపి తొడిగిన నౌహేరా షేక్‌కు చెందిన మరో రూ. 33 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆమెకు చెందిన రూ. 363 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది డిపాజిటర్ల నుంచి నౌహేరా షేక్‌కు చెందిన హీరా సంస్థ వేలాది కోట్ల రూపాయలను సేకరిచింది. తాము డిపాజిట్ చేసిన డబ్బుకు 36 శాతం అధికంగా వడ్డీని చెల్లిస్తానంటూ తెలిపిన నౌహేరా షేక్.. తర్వాత వేలాది మంది డిపాజిటర్లకు మొండి చేయి చూపింది. దీంతో వందలాది మంది డిపాజిటర్లు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో నౌహేరా షేక్‌పై మోసపోయామంటూ కేసులు నమోదు చేశారు. దీనిపై తొలుత హైదరాబాద్ సీసీఎస్‌లో కేసును నమోదు చేసి పోలీసులు దర్యాప్తును నిర్వహించారు. అనంతరం నౌహేరా షేక్ భారీ మొత్తంలో విదేశాల నుంచి కూడా డబ్బులను సేకరించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఈడీ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. దర్యాప్తును ముందుకు కొనసాగించి నౌహేరా షేక్‌ను అరెస్టు కూడా చేసింది. అనంతరం కోర్టు అనుమతితో నౌహేరా షేక్‌కు చెందిన ఆస్థులు రూ. 363 కోట్ల మేరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సీజ్ చేసింది. తాజాగా మరో రూ. 33 కోట్ల మేరకు నౌహేరాకు చెందిన ఆస్థులను ఈడీ స్వాధీన పర్చుకున్నది.