Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ లీకేజీ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నలుగురు నిందితులను 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఏ1 ప్రవీణ్, ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా, ఏ5 రాజేశ్వర్‌కు కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు నిందితులను సిట్ విచారించనుంది. ఈ కేసులో ఏ10 షమీమ్, ఏ11 సురేష్, ఏ12 రమేష్ కస్టడీ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో మొత్తం 19మంది సాక్షులను సిట్ విచారించింది. ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మిని సిట్ సాక్షులుగా చేర్చింది. ప్రవీణ్, రాజశేఖర్ వద్ద పనిచేసిన జూనియర్ అసిస్టెంట్లను, కర్మన్‌ఘాట్‌లోని ఆర్ స్క్వేర్ హోటల్ యజమాని, సిబ్బందిని సిట్ సాక్షులుగా చేర్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకి సిట్ మరోసారి నోటీసులు జారిచేసింది.