Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 కమిటీలునాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు
- టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు 12 కమిటీలను ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే 41వ ఆవిర్భావ వేడుకలకు దాదాపు 15 వేల మంది హాజరుకానున్నట్టు చెప్పారు. శనివారం ఎన్టీఆర్భవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ కంభంపాటి రామ్మోహన్‌రావుతో ఆహ్వాన కమిటీల నాయకులతో బేటీ అయ్యారు. పార్టీ ప్రతినిధుల సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల వేలాది మంది ప్రతినిధులు రానున్నట్టు వివరించారు. సభకు వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం నుంచి నేరుగా ఎన్టీఆర్ ఘాట్‌కు వెళతారనీ, అక్కడ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్‌కు నివాళులను అర్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నాయకులు అశోక్ కుమార్ గౌడ్, అలీ మస్కతి, పి. సాయిబాబా, పర్లపల్లి రవీందర్, ఎ.వి. రమణ, షకీలారెడ్డి, బుగిడి అనూప్, బండారి వెంకటేశ్, రాంనారాయణ, డాక్టర్ ఏఎస్ రావు, సూర్యదేవర లత, లీలావతి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.