Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో 125 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న భారీ అంబేద్కర్ విగ్రహా పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం పరిశీలించారు. ఏప్రిల్ 14వ తేదీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దీన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆమె తనిఖీ చేశారు. ఆమె వెంట రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి తదితరులు ఉన్నారు. పనులన్నింటినీ ఏప్రిల్ 10 తేదీ లోగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. విగ్రహం క్రింది భాగంలో నిర్మిస్తున్న వందమంది కూర్చునే సామర్ధ్యంతో నిర్మిస్తున్న యాంపి థియేటర్ పనులను కూడా ఆమె పరిశీలించారు. అక్కడి ల్యాండ్ స్కేపింగ్తో పాటు ఇతర సివిల్ పనుల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.