Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా మూడు నుంచి పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఐఎన్‌టీఎస్‌వో ఒలంపియాడ్లో ఆలిండియా నెంబర్‌వన్‌గా శ్రీచైతన్య విద్యాసంస్థ విజయభేరి మోగించింది. అఖిల భారత స్థాయిలో ఐఎన్‌టీఎస్‌వో 150 ల్యాప్‌టాప్‌లను ప్రకటించగా అత్యధికంగా 96 (64 శాతం) మంది శ్రీచైతన్య విద్యార్థులే సాధించారు. ఐఎన్‌టీఎస్‌వో 750 ట్యాబ్‌లను ప్రకటిస్తే 472 (63 శాతం) శ్రీచైతన్య విద్యార్థులే పొందారని శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టాప్ ఐదు ర్యాంకుల్లో 58 శాతం ర్యాంకులు, మెడల్స్‌లో 61 శాతం తమ విద్యార్థులే సాధించారని పేర్కొ న్నారు. దేశ వ్యాప్తంగా మరే ఇతర విద్యాసంస్థ ఇంతటి అత్యుత్తమ ఫలితాలు సాధించ లేదని వివరించారు. విద్యార్థి నీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాప క చైర్మెన్ బిఎస్ రావు అభినందించారు.