Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ ఒకటి వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వికాస్ సంస్థాన్ (ఘజి యాబాద్) హైదరాబాద్‌లో నిర్వ హిస్తున్న క్రాఫ్ట్ బజార్ విశేష ప్రజాదరణ పొందు తున్నది.ఇందిరాపార్కు సమీపంలోని కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన క్రాఫ్ట్ బజార్ ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కొనసాగనున్నది. క్రాఫ్ట్ బజార్లో దేశ, విదేశాల నుంచి 100 మంది కళాకారులకు సంబంధించిన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఎంబ్రాయిడరీ, జరీ అండ్ జరీ వస్తులు, బ్లాక్ ప్రింటింగ్, పెయింటింగ్, జువెల్లరీ, టెర్రా కాటా, కార్పెట్, వుడ్ కర్వింగ్, బనారస్ శారీ, మహేశ్వరీ శారీ, కాంత క్రాఫ్ట్, ప్రింటెడ్ బెడ్ షీట్స్ తదితర కళాకారులు నేసినవి అమ్మకానికి పెట్టారు. ప్రజలు కుటుంబ సమేతంగా క్రాఫ్ట్ బజార్‌ను సందర్శించేందుకు వీలుగా ఇక్కడ సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహార స్టాళ్లతో పాటు పిల్లల వినోదం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించారు. హస్తకళాకృతులను కొనుగోలు చేసి హస్తకళాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.