Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ ప్రొఫెసర్స్
- రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసన
నవతెలంగాణ-ఓయూ
బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీపై ఎన్ని కుట్రలు చేసినా ఆయన్ని ప్రజల నుంచి వేరు చేయలేరని, రాహుల్పై అనర్హత వేటు అప్రజాస్వామికమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం, పార్లమెంటు నుంచి బహిష్కరించడం ప్రజాసా ్వమ్యానికి గొడ్డలిపెట్టు అని ప్రొఫెసర్స్ గాలి వినోద్ కుమార్, కొండ నాగేశ్వరరావు, కాశిం సార్, వెంకటదాసు, టెక్నికల్ ఉద్యోగుల సంఘం విజయకుమార్ అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు. మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఓయూలో కాంగ్రెస్ నేత, నిరుద్యోగ జేఏసీ చేనాగని దయాకర్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన తెలియజేశారు. ఎన్టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ మరియు ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి సత్య, ఉదరు కుమార్ బషీర్బాగ్ అధ్యాపక ఫ్యాకల్టీ దుబ్బా రంజిత్ ఆర్.ఎన్. శంకర్ పీడీఎస్యు అధ్యక్షుడు గడ్డం శ్యామ్, పరిశోధక విద్యార్థులు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఖమ్మం నగరంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ముందుగా పట్టణంలో దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, అశ్వారావుపేట, ములకలపల్లి, బూర్గంపాడులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.