Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి పిల్లల అనారోగ్య సమస్యలే కారణం..
కాప్రా-నవతెలంగాణ
అనారోగ్య సమస్యలు, పిల్లల బుద్ధిమాంద్యం సమస్య వల్ల సాఫ్ట్వేర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు విషం తాగి చనిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం..
గాదె సతీష్ (39), అతని భార్య గాదె వేద(35), కుమారులు గాదె నిషికేత్(9), గాదె నిహాల్ (5)తో కలసి కందిగూడలోని క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్మెంట్లో బి107 ఫ్లాట్లో నివసిస్తున్నారు. గాదె సతీష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతని భార్య వేద గృహిణి. ఇద్దరు పిల్లలకు బుద్ధిమాంద్యం సమస్య ఉంది. పెద్ద కుమారుడు నిషికేత్ స్థానికంగా ఉన్న భవిన్స్లో నాలుగో తరగతి చదువుతుండగా, చిన్న కుమారుడు నిహాల్ ఆర్టిజన్ స్కూల్లో చదువుతున్నాడు. పిల్లల ఆరోగ్యం మెరుగవ్వక పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో పిల్లలకు విషం తాగించి వారూ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.