Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది కాలేజీలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు వచ్చేలా చూడాలి
- రెండు మూడు రోజుల్లో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు : మెడికల్ కాలేజీల సమీక్షలో మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశిం చారు. ఈ ఏడాదికిగాను రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీల పై శనివారం హైదరాబాద్లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 67 మందికి పదోన్నతులిచ్చినట్టు మంత్రి చెప్పారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. 1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ప్రోవిషనల్ మెరిట్ లిస్టు విడుదల చేసి, 10 రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సిలింగ్ నిర్వహించి 9 మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించాలన్నారు. 9 మెడికల్ కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అజరు కుమార్, పలు జిల్లా కలెక్టర్లతో హరీశ్ రావు మాట్లాడారు. ఈ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు అవరమయ్యే హాస్టల్ వసతి సహా అన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. తరగతులు ప్రారంభమ య్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, పరికరాలను సిద్దం చేయాలని ఆదేశించారు.ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలన్నారు.
పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మంత్రి ఈ సందర్బంగా కోరారు. మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేసేందుకు గాను, ఈనెల 28న ఆ తొమ్మిది జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, కాలేజీల ప్రిన్సిపాల్స్, ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. వచ్చే వారం రోజుల్లో 9 కొత్త మెడికల్ కాలేజీలు.