Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంజిల్లాలో నలుగురు..
- సూర్యాపేట జిల్లాలో ఇద్దరు కూలీలు
నవతెలంగాణ-ముదిగొండ/వైరా/ మునగాల
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో శనివారం ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లాలో నలుగురు, సూర్యాపేట జిల్లాలో ఇద్దరు కూలీలు చనిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి..ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామానికి చెందిన పోతునూక శివరామకష్ణ(23), పగిళ్ల ఉదరు కుమార్(21) పోలగాని రవీందర్ గ్రామం నుంచి పనిమీద బైక్‌పై శుక్రవారం రాత్రి ఖమ్మం బయలుదేరారు. ఖమ్మం నగరలోని చర్చి కాంపౌండ్ ఫ్లైఓవర్ దిగుతుండగా వాహనం నడుపుతున్న రవీందర్ వెనక్కి చూడటంతో బైక్ అదుపుతప్పి ఫుట్ పాత్ ఎక్కి 30 మీటర్ల వరకు దూసుకుపోయింది. దీంతో ఉదరు కుమార్, శివరామకృష్ణ అక్కడికక్కడే మృతిచెందారు. రవీందర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డంతా రక్తంతో నిండిపోయింది. పోలగాని రవీందర్‌కు ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మేడేపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. డిగ్రీ చదివిన ఈ ముగ్గురూ మంచి స్నేహితులు. ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎదిగిన కుమారులు అకాల మరణం చెందడంతో ఆ తల్లిదండ్రుల గోస అంతా ఇంతా కాదు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
దంపతులను ఢీకొట్టిన లారీ
సత్తుపల్లికి చెందిన యువ దంపతులు రంగా సుభాష్(38), రోజా(34) శనివారం ఉదయం స్కూటీపై హైదరాబాద్ వైపు వెళుతుండగా మధిర క్రాస్ రోడ్డు వద్ద వెనుక నుంచి టిప్పర్ ఢకొీట్టింది. వారిద్దరినీ కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దాంతో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. వైరా ఏసీపీ రెహమాన్, ఎస్ఐ ఎస్.వీరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరించి బంధువులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు కూలీలు ..
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన తుమ్మల ధనమ్మ, నేలమర్రి వినోద(30), చెవుల రోషమ్మ(50) జీఎంఆర్ సంస్థ పనుల్లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు.
ఆకుపాముల సమీపంలో జాతీయ రహదారి మధ్య డివైడర్‌లోని చెట్ల కొమ్మలను కత్తిరించి ట్రాక్టర్ ట్రాలీలో వేస్తుండగా.. విజయవాడ వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో నేలమర్రి వినోద అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన తుమ్మల ధనమ్మ, చెవుల రోషమ్మను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ధనమ్మ పరిస్థితి విషమించి చనిపోయింది. రోషమ్మ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు సమాచారం. నిరుపేదలైన కూలీలు పొట్ట కూటి కోసం పనికి వెళ్లి ప్రాణం కోల్పోవడంతో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాలను కోదాడ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నరేశ్ తెలిపారు.
ప్రమాద స్థలాన్ని ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ తప్పిదాలు. అజాగ్రత్త వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఎస్పీ వెంట కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మునగాల సర్కిల్ సీఐ ఆంజనేయులు, ఎస్ఐ లోకేష్, సిబ్బంది ఉన్నారు