Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చేనెల మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదేనెల 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు 2,652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ఇందులో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులున్నారు. ఈ విద్యా సంవ త్సరం నుంచి పదో తరగతి పరీక్షలు 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే నిర్వహిస్తున్నారు. ఇందు కు సంబంధించి గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈనెల 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాల లకూ విద్యాశాఖ అధికారులు హాల్ టికెట్లు అందచేశారు. కార్యాలయ వెబ్ సైట్ షషష. bరవ.్వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ లో కూడా వాటిని అందు బాటులో ఉంచారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకా లను విడుదల చేసింది. డీఈవోలు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల పరిశీలన పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్ల నియామకం, స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పరీక్ష విధులకు నియమించిన సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్త య్యింది. ఆరోగ్య శాఖ ప్రతి పరీక్షా కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లతోపాటు పరీక్షలు జరిగే అన్ని రోజుల్లో ఒక ఏఎన్ఎంను కేటాయిస్తుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా టీఎస్ఆర్టీసీ సమ యానికి ఎక్కువ సంఖ్యలో బస్సులను నడుపుతుంది. ప్రిపరేషన్ రోజుల్లో, పరీక్షా కాలంలో విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరాను అందించనుంది. జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తుతోపాటు రహస్య సామగ్రిని తరలించేందుకు వాహనాలకు ఎస్కార్ట్స్ ఏర్పాటు చేయాలని వారిని ఆదేశించారు. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.