Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.ఆదివారం గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇన్ ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు తదితరులు డీఎస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి తదితర నాయకులు పాల్గొన్నారు. డీఎస్‌తో పాటు ఆయన కుమారుడు ధర్మపురి సంజరు, మేడ్చల్ సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి
కంటోన్మెంట్ నాయకులు బీఆర్ఎస్ నేత గ్యారసాని రాంకుమార్ (కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మెన్ గ్యారసాని గౌరీశంకర్ కుమారుడు) కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.