Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్జేడీసీఎల్ఏకు మంత్రి హరీశ్‌రావు హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలోనే క్రమబద్ధకరిస్తామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు చెప్పారు. 11,013 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తా
మంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (ఆర్జేడీసీఎల్ఏ) అధ్యక్షులు గాదె వెంకన్న నేతృత్వంలో ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలోనే క్రమబద్ధీకరణ చేస్తామనీ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, లవ్ కుమార్, సంపత్‌కుమార్, సంతోష్‌రెడ్డి, పున్నారావు, సత్యనారాయణ, నర్సింలు, విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.