Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్విచక్ర వాహనాన్ని ఢకొనడంతో ప్రమాదం
- ద్విచక్ర వాహనదారుడు మృతి
నవతెలంగాణ-మునగాల
ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢకొట్టడంతో ఎగసిపడిన మంటల్లో బస్సు కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ద్విచక్రవాహ నదారుడు మృతిచెందాడు . ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల పరధిలోని ఇందిరానగర్ సమీపంలో 65జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ఎస్ఐ లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం ..
హైదరాబాద్ మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని ఏసీ ఎక్స్ప్రెస్ బస్సు విజయవాడకు వెళ్తోంది. అయితే, ఇందిరానగర్ సమీపంలో గ్రామానికి చెందిన రాజు ద్విచక్రవాహనంపై పొలానికి వెళ్లి ఇంటికి వచ్చే క్రమంలో మట్టి రోడ్డు నుంచి జాతీయ రహదారి ఎక్కుతుండగా బస్సు ఢకొట్టింది. క్షణాల్లోనే స్కూటీ నుంచి మంటలు లేచి బస్సు ముందు భాగానికి అంటుకున్నాయి. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేసి ప్రయాణికులను వెంటనే దింపేశాడు. సంఘనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికే బస్సు, స్కూటీ మొత్తం కాలిపోయాయి. ప్రయాణికుల సామాన్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మురుగేష్ రాజు(45) తీవ్రంగా గాయపడటంతో సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. బస్సులో వున్న 13 మందిని ఇతర వాహనాల్లో పంపించారు. ఘటనా స్థలంలో దట్టంగా పొగ కమ్ముకోవడంతో జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మునగాల సీఐ ఆంజనేయులు పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.