Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసినట్టుగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విమర్శించారు. శుక్రవారం ఆయన వర్చువల్ ద్వారా తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోయాక అది కాస్త వీఆర్ఎస్గా మారిపోతుందని జోష్యం చెప్పారు. కేసీఆర్, ఆయన కుటుంబమంతా అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారన్నారు. బిడ్డ కవిత ఈడీ కేసు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణ, ఏపీల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, రైల్వేలైన్ల నిర్మాణానికి పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా బీజేపీ గెలుస్తుందన్నారు. పేపర్ లీక్ జరిగితే సీఎంగా ఉన్న కేసీఆర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మునుగోడులో పోలింగ్ ఏజెంట్లు లేని బీఆర్ఎస్ దేశమంతటా సభలు పెడితే ఏమైతదని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్‌చుగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, మురళీధర్‌రావు, అరవింద్ మిషన్, రఘునందర్రావు, ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, నందీశ్వర్‌గౌడ్, బాబుమోహన్, సంగప్ప, దేశ్‌పాండే పాల్గొన్నారు.