Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నదని సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి విమర్శించారు. అదానీ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేత రోహిన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అదానీ, మోడీ సంబంధాలపై రాహుల్ నిలదీశారని గుర్తు చేశారు. అదానీ వ్యవహారం బయటపడొద్దనే ఉద్దేశంలోనే రాహుల్‌గాంధీని లోక్‌సభ నుంచి బయటకు పంపించారని విమర్శించారు. అక్రమాలకు,అప్రజాస్వామిక విధానాలకు, మోడీ అరాచకాలకు వ్యతిరేకంగా రాహుల్ మాట్లాడుతున్నారని చెప్పారు. మోడీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు.