Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వినూత్నమైన పొదుపు పథకం ఐసిఐసిఐ ఫ్రు గోల్డ్ ప్లాన్ను ఆవిష్కరించినట్లు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలి పింది. ఈ పాలసీ జారీ చేసిన 30 రోజుల నుంచి సప్లిమెంటరీ ఆదాయం పొందవచ్చని పేర్కొంది. ప్రతి 5వ పాలసీ సంవత్సరంలో అదనపు గ్యారెంటీడ్ ఆదాయం అందించనున్నట్లు తెలిపింది. జీవితాంతం ఖచ్చితంగా ఆదాయం పొందే అవకాశంతో పాటుగా ఈ పధకంలోని జీవిత బీమా కవరేజీ కుటుంబానికి ఆర్థిక భద్రతను సైతం అందిస్తుందని తెలిపింది. వినియోగదారుల వైవిధ్యమైన అవసరాలను తీర్చేరీతిలో ఇమీడియట్ ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్ విత్ బూస్టర్, డిఫర్డ్ ఇన్కమ్ తదితర మూడు వేరియంట్లలో లభ్యమవుతుందని తెలిపింది.