Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొచ్చర క్రాస్ రోడ్డు వద్ద రైతుల ధర్నా
నవతెలంగాణ-బోథ్
నష్టపోయిన మొక్కజొన్న పంటను సర్వే చేయాలని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల రైతులు ధర్నా చేశారు. కనుగుట్ట గ్రామంలో ఇటీవల అకాల వర్షంతో మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ పంటను వ్యవసాయ అధికారి సర్వే నిర్వహించడం లేదని పొచ్చర క్రాస్ రోడ్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఎమ్మెల్యే రైతులను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ నినాదాలు చేశారు. అధికారులు సైతం ఈ విషయంలో స్పందించకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వే నిర్వహించి పంట నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కనుగుట్ట గ్రామ రైతులు అశోక్, ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.