Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజామాబాద్‌లో 'పచ్చని' ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన రైతులు
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
నిజామాబాద్‌లో పసుపు 'బోర్డు' ఏర్పాటయిందంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఎంపీ అరవింద్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని అనుకుంటే మీరు 'పసుపులో' కాలేసినట్టే. ఎంపీ అరవింద్ దృష్టిలో పసుపు బోర్డులు ఇవే అంటూ పచ్చని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో, రద్దీ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం ఏర్పాటు చేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటే ప్రధాన అస్త్రంగా బీజేపీ నుంచి ఎంపీ అరవింద్ పోటీపడిన విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా తాను గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని, ఒక వేళ తీసుకురాలేని పక్షంలో పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమిస్తానని.. పోలింగ్‌కు రెండు రోజుల ముందు అరవింద్ బాండ్ పేపర్ రిలీజ్ చేసిన విషయం విధితమే. కాగా గెలిచిన నాటి నుంచి పసుపు బోర్డుపై రైతులు ప్రశ్నించినప్పుడల్లా దాటవేస్తూ వస్తున్నారు. దాంతో ఎంపీ అరవింద్‌ను ఎప్పటికప్పుడు రైతులు అడ్డుకుంటూ నిలదీస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశమైంది.