Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ
నవతెలంగాణ-ఖమ్మం
రవాణా రంగాన్ని రక్షించుకుందామని, 2019 రవాణా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.విక్రమ్, జిల్లా కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా వాహనాలకు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. టోల్ ట్యాక్స్ పెంపుతో ప్రజలపై అదనపు భారం పడుతుందని, నిత్యావసర ధరలు పెరుగుతాయని, కాబట్టి టోల్ ట్యాక్స్ పెంపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మోటార్ వాహన చట్టం 2019 సవరించాలని కోరారు. ఈనెల 5న చలో ఢిల్లీ మజ్దూర్, కిసాన్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ధరవత్ రాందాస్, జిల్లా కోశాధికారి దండగల ఉపేందర్, ఆటో యూనియన్ జిల్లా నాయకులు శ్రీను, యాసీన్, అక్బర్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నవీన్‌రెడ్డి, డ్రైవర్లు రమేష్, శ్రీను, నాగేశ్వరావు, కాసిం, తదితరులు పాల్గొన్నారు.