Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పెంపుడు జంతువులను సంరక్షిస్తున్న బ్లూ క్రాస్ సంస్థకు ఎస్బిఐ లేడిస్ క్లబ్ సాయాన్ని అందించింది. రూ.24,000 విలువ చేసే చెక్కును బ్లూ క్రాస్‌కు ఎస్బిఐ లేడిస్ క్లబ్ ప్రెసిడెంట్ నుపూర్ జింగ్రాన్ అందజేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సుజాత మిశ్రా, సెక్రటరీ మాధవి ప్రసాద్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సాయం పట్ల బ్లూ క్రాస్ హైదరాబాద్ ఫౌండర్ అమల అక్కినేని ప్రశంసించారు.