Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన మంత్రి తలసాని
హైదరాబాద్ : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆదూరి గ్రూప్ తన నూతన శాఖను బంజారాహిల్స్లో ఏర్పాటు చేసింది. గురువారం దీన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో నివాస స్థలం కల్పించాలన్న ఆదూరి గ్రూప్ చైర్మన్ ఆదూరి రామాంజనే యులు ఆశయం నెరవేరాలని కోరుకుంటూ అభినందనలు తెలియ జేసారు. ఈ కార్యక్రమంలో ఆదూరి గ్రూప్ చైర్మన్ ఆదూరి రామాంజనే యులు, ఎండి ఆదూరి కామాక్షి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుసూధనా రెడ్డి, డైరెక్టర్స్ వీర భద్ర, అక్క బాలరాజ్, ఆర్యన్, రాధారపు లక్ష్మణ్ కే .దొర స్వామి, పోహార్ పండరినాథ్, సల్కాపురం అనిల్ కుమార్, పిచ్చయ్య బాబు, ప్రత్యూష, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.