Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబద్ధత, నైతికతే ఆయన నైజం
- ఉద్యోగ విరమణ సందర్భంగా సీనియర్ ఫొటోగ్రాఫర్ల ప్రశంసలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఫోటోగ్రఫీకి ప్రతిబింబంగా ఫోటో జర్నలిస్ట్ ఆర్వీ కోటేశ్వరరావు (ఆర్వీకే) నిలుస్తారని పలువురు సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్లు కొనియాడారు. నిబద్ధత, నైతికతతో ఆయన విధులు నిర్వహించి, ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వాలకు ఏ వార్తలకు ఏ ఫోటోలు చూపించాలనే సృజనాత్మకత ఆర్వీకే సొంతమనీ, ప్రజాసమస్యలను ఛాయాచిత్రాలుగా తీసి, పరిష్కారమార్గాల అన్వేషిగా విధుల్ని కొనసాగించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆంగ్ల దిన పత్రిక చీఫ్ ఫోటోజర్నలిస్టు ఆర్వీ కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ సభ జరిగింది. దీనికి సాక్షి దిన పత్రిక చీఫ్ ఫోటో జర్నలిస్టు కె. రవికాంత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి, ఫోటో జర్నలిస్టులు సి. కేశవులు, హెచ్. సతీష్, డి. రవీందర్‌రెడ్డి, పి. అనిల్‌కుమార్, ఎండి.ఇల్యాస్ తదితరులు ఆర్వీకేకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి, మెమెంటో అందజేశారు. ఈ సందర్బంగా సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సీ కేశవులు మాట్లాడుతూ ఫోటో జర్నలిస్ట్‌లు వార్తా మాధ్యమానికి సహకరిస్తారనీ, నిజాయితీ, నిష్పాక్షికంగా ఛాయాచిత్రాల కోసం ప్రయత్నిస్తారని చెప్పారు. హెచ్ సతీష్ మాట్లాడుతూ ఫోటో జర్నలిజం అనేది రిపోర్టింగ్‌కు మరో రూపమని స్పష్టంచేశారు. డి. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పదాలు లేకుండా ఫోటోజర్నలిస్టు తీసిన ఒక ఫోటో మొత్తం కథనాన్ని తెలియజేసేలా ఉండాలనీ, ఆర్వీకే అలాంటి అనేక చిత్రాలను ప్రజల మనసుల్లో నింపే శారని ప్రసంసించారు. కె. రవి కాంత్ రెడ్డి మాట్లాడుతూ ఫోటోకు భాష అవసరం లేదన్నారు. సత్యాన్ని సత్యం గా చెప్పే శక్తి ఫోటో జర్నలిజానికే ఉందన్నారు. కె.ఎన్. హరి మాట్లాడు తూ ఆర్వీకే ఫోటో జర్నలిజానికి చేసిన సేవల్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్న లిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. కిషోర్‌సింగ్, పి. రాంమూర్తి, సం యుక్త కార్యదర్శి బిహెచ్ఏంకె గాంధీ, కోశాధికారి కె అనిల్ కుమార్, కార్య వర్గ సభ్యులు నక్క శ్రీనివాస్, పి. హరి కష్ణ, ఎన్. శివకుమార్, హైదరా బాద్ జిల్లా అధ్యక్షులు హదయానంద్ పాల్గొన్నారు.