Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులను పరిశీలించిన మంత్రుల బృందం
నవ తెలంగాణ:ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహా విష్కరణ కార్యక్రమం ఉంటుందని మంత్రుల బృందం స్పష్టం చేసింది. హైదరాబాద్లో అత్యంత ఎత్తు లో నిర్మి స్తున్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహన్ని శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో మంత్రు లు హరీష్ రావు, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, తల సాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లా రెడ్డి, కార్పొరేషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మేయర్ విజయ లక్ష్మి విగ్రహ పనులను పరిశీలించారు. మరో వారం రోజుల్లో నిర్మాణ పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో సిబ్బంది పనిచేస్తు న్నదని కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. విగ్రహంతోపాటు అక్కడ నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, ప్రధాన ద్వారం, వాటర్ ఫౌంటెన్, సాండ్ స్టోన్ పనులు, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, భవనం లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు. విగ్రహం నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగిస్తున్నట్టు మంత్రి తెలిపారు.