Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎవరా ఇద్దరూ అని జోరుగా చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సంబంధిత ఉన్నతాధికారులను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, టీఎస్పీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ సెటైర్ విసిరారు. ''టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. తీగలాగితే ప్రగతిభవన్ డొంక కదిలిందా?.. విచారణలో 'బావ'.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. మీకు అర్థం అవుతుందా ''పరువు'' గల కేటీఆర్ గారూ...?'' అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు టీఎస్పీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డి బయోడేటాను జతచేస్తూ రేవంత్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం రేవంత్ ట్వీట్ వైరల్‌గా మారింది. అసలు రేవంత్ ట్వీట్ చేసిన బావా.. బావమర్ధులు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ట్వీట్లో రేవంత్ ప్రస్తావించిన ఈ బావా బావమర్దుల్లో ఒకరు గతంలో సీఎంవోలో పనిచేసిన ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అనే చర్చ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది.