Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని ప్రక్షాళన చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దానికి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సిట్ నోటీసులు అందుకున్న ప్రస్తుత కమిషన్ నేతృత్వంలో మళ్లీ పరీక్షలు నిర్వహించే లీకేజీ అయ్యే అవకాశముందని తెలిపారు. నిరుద్యోగులు అభద్రతాభావంలో ఉన్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలని సూచించారు. లీకేజీ వెనుక ఎంత పెద్దవారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.