Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిక్షణ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్‌యూనియన్(సీఐటీయూ) డిమాండ్
- శిక్షణ సెన్సార్‌బోర్డు చైర్మెన్ అనిల్ కుర్మాచలానికి వినతి
నవతెలంగాణ-హైదరాబాద్రో
దసరా సినిమాలో అంగన్వాడీ ఉద్యోగులను గుడ్లు దొంగతనం చేసేవారిగా చిత్రీకరించిన సన్నివేశాలను తక్షణమే తొలగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్‌యూనియన్(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు సెన్సార్‌బోర్డు చైర్మెన్ అనిల్ కుర్మాచలానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా సినిమాలో హీరోయిన్ అంగన్వాడీ టీచర్‌గా నటిచిందని, సాయంత్రం సమయంలో ఆమె సెంటర్ తాళం తీసి కోడిగుడ్లను కొంగులో పెట్టుకుని దొంగతనం చేస్తున్నట్టు డైరెక్టర్ చూపించడం చిరుద్యోగులను అవమానించడమేనని పేర్కొన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు 45ఏండ్లుగా అతి తక్కువ వేతనాలతో పేద ప్రజలకు సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు, కాగ్ నివేదిక,45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అంగన్వాడీ సేవలను మెచ్చుకున్నాయని తెలిపారు.దేశంలో మాతా శిశు మరణాలతోపాటు పోషకాహార లోపాన్ని అరికట్టడంలో అంగన్వాడీ ఉద్యోగుల కృషి అమోఘమని వివరించారు. ఐసీడీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం 60శాతం బడ్జెట్‌ను తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి టీఏ,డీఏ, ఇతర బిల్లులను చెల్లించడంలేదని, ఈ క్రమంలో సొంత ఖర్చులతో సేవలందిస్తున్న ఉద్యోగులను కించపరచడం సరైందికాదని తెలిపారు. ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించడం అంగన్వాడీ ఉద్యోగులపై దాడిచేయడమేనని, సెన్సార్‌బోర్డు జోక్యం చేసుకుని ఆ సన్నివేశాలను తొలగించాలని కోరారు. లేకుంటే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై అనిల్కుర్మాచలం సానుకూలంగా స్పందించారని, అభ్యంతరకర సన్నివేశాలను సెన్సార్‌బోర్డు దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్‌యూనియన్(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, ఉపాధ్యక్షులు భూపాల్ ఉన్నారు.
వెంటనే తొలగించాలి : ఐద్వా
దసరా సినిమాలో అంగన్వాడీ టీచర్ దొంగతనం చేసినట్టు చూపించిన సన్నివేశాన్ని తక్షణమే తొలగించాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని, పసిపాపలకు ఓనమాలు నేర్పే పాత్రను పోషిస్తున్న టీచర్‌ను దొంగగా చిత్రీకరించడాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లులక్ష్మి తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించడం, బస్తీల్లో ఎక్కడీ ఎంతమంది గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, కౌమార బాలికలు ఉన్నారనే లెక్కలతో సహా డేటా తీస్తూ ప్రభుత్వం సరఫరా చేసినటువంటి కొద్దిపాటి సరుకులను అర్హులకు అందిస్తూ గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీకి గురవుతున్న మహిళలను డైరెక్టర్ కించపరచడం తగదన్నారు.