Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ అసిస్టెంట్ పరీక్ష వాయిదా
- అభ్యర్థులను పరీక్ష కేంద్రంలో కూర్చోబెట్టి బయటకు పంపించిన వైనొం ఈనెల 5న నిర్వహిస్తామని ప్రకటన
నవతెలంగాణ-నాచారం
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో ఎంతో మంది నిరుద్యోగులు నష్టపోగా.. తీవ్ర నిరాశ.. ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం జరగాల్సిన రాష్ట్ర హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షను సర్వర్ డౌన్ వల్ల నిర్వహించలేదు. హైదరాబాద్ నాచారం పరిధిలోని మల్లాపూర్ నోమ అయాన్ డిజిటల్ జోన్ ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 6:45వరకు పరీక్ష జరగాల్సి ఉంది. దీనికి సుమారు 1500 మంది అభ్యర్థులు హాజరైనట్టు సమాచారం. వారి నుంచి అన్ని ఆధారాలు సేకరించి లోపల కూర్చోబెట్టిన అయాన్ డిజిటల్ జోన్ నిర్వాహకులు సర్వర్ సమస్య కారణంగా పరీక్ష కొంత ఆలస్యంగా నిర్వహిస్తామని చెప్పారు. కానీ మొత్తానికే పరీక్ష నిర్వహించకుండానే అభ్యర్థులను పంపించారని అభ్యర్థి సూరజ్ వెల్లడించారు. ఈ క్రమంలో అయాన్ డిజిటల్ జోన్ నిర్వాహకులకు, అభ్యర్థులకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. మల్లాపూర్ ప్రధాన రహదారిపై బైటాయించే ప్రయత్నం చేయగా అడ్డుకున్నారని అభ్యర్థి సూరజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
5వ తేదీన పరీక్ష
మల్లాపూర్ అయాన్ డిజిటల్ జోన్ సెంటర్లో సర్వర్ సమస్యతో నిర్వహించలేకపోయిన హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షను ఈనెల 5వ తేదీన పెడతామని హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నోటిఫికేషన్ విడుదల చేశారు. నిరుద్యోగ అభ్యర్థులు విషయాన్ని గమనించి తిరిగి పరీక్షకు హాజరు కావలసిందిగా కోరారు.