Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖలో నలుగురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (ఎస్ఐఈటీ) డైరెక్టర్గా ఎస్ విజయలక్ష్మి బాయి, వయోజన విద్య సంచాలకులుగా జి ఉషారాణి, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా ఉన్న సిహెచ్ రమణకుమార్కు తెలంగాణ మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలతోపాటు జవహర్ బాలభవన్ డైరెక్టర్, ప్రత్యేక అధికారిగా నియమించామని తెలిపారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులుగా ఎ కృష్ణారావుకు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నారని, వచ్చాక ఈ బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపారు.