Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్యాభర్తలు,వృద్ధుడిపై జైల్ కానిస్టేబుల్ దాడి
- ఇష్టానుసారంగా కొట్టడంతో గాయపడ్డ మహిళ
- ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు
నవ తెలంగాణ సిద్దిపేట అర్బన్
కూలీ చేసుకుని జీవనం సాగించే భార్యాభర్తలు, వృద్ధుడిపై పోలీసనే అధికారంతో జైల్ కానిస్టేబుల్ లాఠీ ఝుళిపించడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, సర్పంచ్ రవీందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏన్సాన్పల్లి గ్రామ పరిధిలో సబ్ జైలు కోసం ప్రభుత్వ భూమిని కేటాయించారు. కేటాయించిన స్థలం పరిధి చూసుకోవడానికి సబ్ జైల్‌కు చెందిన సిబ్బందిలో నుంచి ఒకరిని వాచ్‌మెన్‌గా పెట్టారు. జైలుకు కేటాయించిన స్థలం ఖాళీగా ఉండటంతో కొన్ని రోజుల నుంచి మెగా సంస్థకు చెందిన వ్యక్తులు అక్కడ తమ సామగ్రిని ఉంచుకొని పనులను కొనసాగించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వారు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయిన తర్వాత అక్కడ వదిలి వెళ్లిన చిన్న చిన్న ఇనుప ముక్కలను ఏరుకొని అమ్ముకోవడానికి గ్రామ పరిధిలోని తిప్పరబోయిన కాలనీకి చెందిన భార్యాభర్తలు తిప్పర బోయిన ఎల్లయ్య, మణెమ్మ, తిప్పరబోయిన నరసయ్య (వృద్ధుడు)తో కలిసి ఆదివారం అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఇక్కడికి రావద్దంటూ బెదిరించాడు. దాంతో వారు అతనితో వాగ్వాదానికి దిగారు. తాను కానిస్టేబుల్‌నని, తనతోనే ఇష్టానుసారంగా మాట్లాడతారా.. అంటూ తన చేతిలో ఉన్నలాఠీÄతో మొదటగా భార్యాభర్తలపై, తర్వాత వృద్ధుడిపై దాడి చేసి గాయపరిచారు. వృద్ధుడు నరసయ్యను కడుపులో కొట్టడంతో అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాము ఇనుప ముక్కలు ఏరుకోవడానికి వచ్చామని చెబుతున్నా వినకుండా లాఠీతో కొట్టి కాళ్లతో ఇష్టానుసారంగా తన్నాడని బాధితులు తెలిపారు. కానిస్టేబుల్‌తో వచ్చిన అతని భార్య కూడా దాడిలో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ విషయమై బాధితులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని సీఐ భానుప్రకాష్, సర్పంచ్ రవీందర్ గౌడ్ పరిశీలించారు. పోలీసులు పంచనామా నిర్వహిం చారు. బాధితులు ఫిర్యాదు మేరకు, పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.