Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ముఖ్యమంత్రి కేసీఆర్ తాను చదివిన ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికెట్లను చూపించాలని బీజేపీ రాష్ట అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజాన్ని చదివి దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళుతుంటే... కేసీఆర్ కుటుంబం చదువుకున్న చదువును డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు ఉపయోగిస్తూ వేల కోట్లు దోచుకుంటున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బీరు...రమ్...స్కాచ్ పార్టీ అనీ, కేసీఆర్ కుటుంబమంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులని ఎద్దేవా చేశారు. 8 ఏండ్ల క్రితం ఇల్లు తప్ప ఏమీలేని సీఎం కేసీఆర్ ఇప్పుడు వేల కోట్లతో ప్రతిపక్ష పార్టీలకు డబ్బులిచ్చే స్థాయికి ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ తదితరులతో కలిసి ఆయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మైదానానికి వచ్చారు. కేసీఆర్ కుటుంబం చదువుకున్న అజ్ఞానులని విమర్శించారు. వరంగల్ జిల్లాలో త్వరలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామనీ, అన్ని జిల్లాల్లోనూ ఇవి జరుగుతాయని చెప్పారు. హైదరాబాద్లో కూడా లక్షలాదిమందితో నిరుద్యోగ మార్చ్, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.