Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ, పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏఐఎఫ్డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల ఆరో తేదీన ఆందోళన చేపడతామని తెలిపారు. 15న నిరుద్యోగ యువతకు ఉపాధితోపాటు నిరుద్యోగ భృతి కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రాలను అందజేస్తామని పేర్కొన్నారు.