Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాపం తెలిపిన సీపీఐ(ఎం), ఏఐఏడబ్ల్యూయూ, ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కళారంగంలో సుపరిచితులు, ఏఐఏడబ్ల్యూయూ నేత, సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు సునీత్ చోప్రా (81) హఠాన్మరణం పొందారు. ఢిల్లీ లోని రాంలీలా మైదానంలో బుధ వారం జరగనున్న మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీకి ముందు, సునీత్ చోప్రా మంగళవారం హర్యానా లోని గురుగ్రామ్ జిల్లా నుంచి ఢిల్లీలోని వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కార్యాలయానికి వెళుతుండగా మర ణించారు. మార్గ మధ్యలోనే సికెంద్ర పూర్ మెట్రో స్టేషన్లో సెక్యూరిటీ చెకింగ్ విభాగం వద్ద కార్డియాక్ అరెస్టుతో కుప్పకూలి పోయారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది ఆయ నకు ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. సునీత్ చోప్రా మరణానికి సీపీఐ(ఎం) ప్రగాఢ సంతాపం తెలి పింది. ఈ మేరకు సీపీఐ(ఎం) ప్రధా న కార్యదర్శి సీతారాం ఏచూరీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ''అర్ధ శతాబ్ద కాలం పాటు సహచరుడు. సోషలిజం కోసం ప్రజల పోరా టాల్లో తామిద్దరం కలిసి ప్రయాణిం చాం. ఉద్వేగ భరితమైన నిబద్ధత కలిగిన మార్క్సిస్ట్, ఆయన ప్రజల ప్రయోజనాల కోసం అవిశ్రాంతంగా పోరాడారు'' అని పేర్కొన్నారు. సునీత్ చోప్రా మరణంతో దేశంలోని కార్మిక-కర్షక ఉద్యమ స్ఫూర్తి నింపిన దార్శనిక నాయకుడిని కోల్పోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సునీత్ చోప్రా మరణం సంతాప సూ చికగా ఏఐఏడబ్ల్యూయూ ఎర్ర జెండా ను అవనతం చేసింది. తమ సంఘం మాజీ సహాయ కార్యదర్శి సునీత్ చోప్రా మరణానికి సంతాపం తెలు పుతున్నట్టు ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయ రాఘ వన్, బి.వెంకట్ ప్రకటన విడుదల చేశారు. దేశంలోని వ్యవసాయ కార్మికు లు, గ్రామీణ పేదల కోసం పోరాడిన వ్యక్తి సునీత్ చోప్రా అని గుర్తు చేశారు. సునీత్ చోప్రాకు ఎస్ఎఫ్ఐ నివాళులర్పించింది. సామాజిక ఉద్యమ కారిని తీస్తా సెతల్వాద్, సీనియర్ జర్నలిస్టు పరం జోరు గుహ ఠాకుర్తా తదితరులు సంతాపం తెలిపారు.