Authorization
Fri April 11, 2025 05:08:07 pm
- 70,041 మంది విద్యార్థుల దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఆదివారం రాతపరీక్ష జరగనుంది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు సిహెచ్ రమణకుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి, అదేరోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏడు నుంచి పదో తరగతి వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈనెల ఆరో తేదీ నుంచి షషష.్రఎశీసవశ్రీరషష్ట్రశీశీశ్రీర.షశీఎ వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని వివరించారు. 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. ఆరో తరగతి ప్రవేశాల కోసం 40,137 మంది, ఏడో తరగతి కోసం 12,545 మంది, ఎనిమిదో తరగతి కోసం 9,998 మంది, తొమ్మిదో తరగతి కోసం 5,676 మంది, పదో తరగతి కోసం 1,685 మంది దరఖాస్తు చేశారని వివరించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ మాస్క్ ధరించాలని, కోవిడ్ నిబంధనలతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.