Authorization
Fri April 11, 2025 02:59:37 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల కాలంలో రాష్ట్రంలో అత్యధికంగా ఒక్క రోజులో 52 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం కోవిడ్ స్టేటస్ బులెటిన్ విడుదల చేసింది. 40 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 281 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా అనుమానిత లక్షణాలున్న 7,154 మందికి టెస్టులు చేయగా వారిలో 0.71 శాతం మందిలో కోవిడ్-19 ఉన్నట్టు ఫలితాల్లో వెల్లడైంది. అంతకుముందు వారంలో సోమవారం 41, ఆదివారం 30, శనివారం 31, శుక్రవారం 43, గురువారం 45, బుధవారం 39 చొప్పున కేసులొచ్చిన సంగతి తెలిసిందే.