Authorization
Sun April 13, 2025 04:05:05 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను గురువారం హైదరాబాద్లోని మంత్రుల గృహ సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులతో పాటు జగిత్యాల, పెద్దపల్లి నియోజకవర్గం నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా కొప్పులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధుకర్, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్చైర్మెన్ హరినారాయణ్ రావుతో పాటు రాష్ట్రం నుంచి వచ్చిన వివిధ సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.