Authorization
Tue April 08, 2025 03:51:48 am
- ఈటల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతున్నదనే భయంతోనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు. విపక్షాలు ఏకమై పోరాడాల్సిన పరిస్థితి నుంచి విఛ్ఛినమయ్యే పరిస్థితి తీసుకొచ్చారని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు జి. నిరంజన్, అద్దంకి దయాకర్, పాల్వాయి స్రవంతి, కల్వ సుజాత తదితరులు విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్‌గా ఉన్న ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికలు లేకపోవడంతో ఆయన బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.18వేల కోట్లు పెట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొనుగోలు చేసిందన్నారు. ఈ క్రమంలో మోడీ, అమిత్‌షా దగ్గర మార్కులు కొట్టేందుకే ఈటల ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీని లేపడానికి కేసీఆర్ పనిగట్టుకుని పనిచేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో జేడీఎస్, ఎంఐఎం కలయిక వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయని విమర్శించారు.