Authorization
Tue April 08, 2025 01:26:30 pm
- చార్మినార్,మక్కా మసీదు వద్ద ముస్లిం సోదరుల ప్రార్థనలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ జిల్లాలపాటు రాజధాని హైదరాబాద్ నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా ముగిశాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 21 వరకు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా మసీదులన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. చార్మి నార్, మక్కా మసీద్ వద్ద రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 9:30 తర్వాత చార్మినార్, మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్ష తర్వాత వారు రంజాన్‌ను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ముస్లిం సోదరులు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.