Authorization
Mon April 14, 2025 08:17:31 am
- కర్నాటక రైస్ ఇండిస్టీస్ సంస్థ, వ్యవసాయ
- విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం
నవతెలంగాణ రాజేంద్రనగర్:కర్నాటకతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ సోన, ఆర్ఎన్ఆర్-15048 వరి రకం బియ్యం మార్కెటింగ్‌కు సంబంధించి కర్నాటక (బళ్లారి)కి చెందిన మల్లికార్జున రైస్ ఇండిస్టీస్ సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం రెండేండ్ల పాటు అమలులో ఉంటుంది. ఒప్పంద పత్రాలపై మల్లికార్జున రైస్ ఇండిస్టీస్ ప్రతినిధులు మల్లికార్జున్, మంజునాథ, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో పరిశోధనా సంచాలకులు డాక్టర్ వెంకటరమణ, డైరెక్టర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ జమునారాణి, రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.