Authorization
Tue April 08, 2025 02:29:31 pm
- ప్రధాన కార్యదర్శిగా మారం జగదీశ్వర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర నాన్ గెజిటెడ్ (టీఎన్జీవో) కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మామిళ్ల రాజేందర్ రెండోసారి, ప్రధాన కార్యదర్శిగా మారం జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జి వెంకటేశం, సహాయ ఎన్నికల అధికారిగా శశికాంత్రెడ్డి వ్యవహరించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులతోపాటు 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరై శనివారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. కేంద్ర సంఘం ఎన్నికల్లో కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులుగా కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం సత్యనారాయణగౌడ్, కోశాధికారిగా రామినేని శ్రీని వాసరావు, పదిమంది ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యు లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేం దర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల సాధన కోసం ప్రభుత్వంతో స్నేహపూర్వకం గా ఉంటూనే పరిష్కరించుకుందామని చెప్పారు. త్వరలోనే ఈహెచ్ఎస్ కార్డులు, పీఆర్సీ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని అన్నా రు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజేందర్ నాయకత్వంలో కలిసి పనిచేస్తానని చెప్పారు.