Authorization
Tue April 08, 2025 07:25:23 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై నూతన సచివాలయంలో తొలి సంతకాన్ని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేయనున్నారు. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు అడుగుపెట్టబోతున్నారు. నూతన సచివాలయంలోని మూడో అంతస్తులో గల తన కార్యాలయం నుంచి తన విధులను నిర్వర్తించనున్నారు.