Authorization
Sat April 05, 2025 07:37:20 am
నవతెలంగాణ - హైదరాబాద్
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భద్రాచలం, ఇల్లెందు, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ కో-ఆర్డినేటర్ల(సమన్వయకర్తలు)ను తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నియమించారు. భద్రాచలం(ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా ఈసం శశింధర్, ఇల్లెందు (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా ముద్రగడ వంశీ, నర్సంపేట్(జనరల్) అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా అడపా నర్సింగరావును నియామకం చేస్తూ మంగళవారం వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ టీడీపీ పార్లమెంటు పరిశీలకులు రామచందర్‌రావు, మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నాయకులు మండూరి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.