Authorization
Tue April 08, 2025 02:46:43 pm
- విచారణకు సుదీర్ఘ సమయం
- సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పిటిషన్ల విచారణ అంత సులువు కాదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ వ్యాఖ్యానిం చారు. రాష్ట్ర విభజన తీరును సవాల్ చేస్తూ తెలంగాణ వికాస కేంద్రంతో పాటు పలువురు మాజీ మంత్రులు, నాయకులు, సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ల విచారణ అంత సులువు కాదని, సుదీర్ఘ సమయం తీసుకుంటుందని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమయం తక్కువగా ఉన్నందున వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని తెలిపారు. అనంతరం కేసుల విచారణను ఆగస్టు 22 నాటికి ధర్మాసనం వాయిదా వేసింది.