Authorization
Sat April 05, 2025 09:14:00 am
- రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అత్యున్నత రాజ్యాంగ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ప్రభుత్వం ఎప్పుడూ ప్రొటోకాల్ పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సీి-20 సమావేశాల్లో గవర్నర్ మాట్లాడారు. తాను తెలంగాణకు సేవ చేయడానికే వచ్చాననీ, రాజకీయాలు చేయడానికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ తనపై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు.